Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీడిన ఉత్కంఠ : పర్యటనకు ఓకే.. విశాఖకు రానున్న చంద్రబాబు

Webdunia
ఆదివారం, 24 మే 2020 (21:42 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు అనుమతినిచ్చే విషయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సోమవారం విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటించేందుకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అనుమతి ఇచ్చారు. దీంతో చంద్రబాబు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో చేరుకుంటారు. అక్కడ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శిస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అమరావతికి చంద్రబాబు చేరుకుంటారు. 
 
కాగా, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించాలని, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించాలని చంద్రబాబు నిర్ణయించుకుని, తన పర్యటనకు అనుమతి ఇవ్వాలని పేర్కొంటూ అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖల వద్ద అనుమతి కోరారు. ఈ అనుమతి కోరిన మరుక్షణమే తెలంగాణ పోలీసులు చంద్రబాబు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణంకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. 
 
కానీ, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాత్రం పెండింగ్‌లో పెట్టినట్టు కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు ఏపీ డీజీపీ నుంచి కూడా అనుమతి రావడంతో సోమవారం చంద్రబాబు విశాఖ పర్యటనపై ఉత్కంఠ వీడింది. సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన హైదరాబాద్ నుంచి వైజాగ్ బయల్దేరనున్నారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన అనంతరం చంద్రబాబు విశాఖ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో అమరావతి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

Allu Aravind: తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments