Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాంప్ ఆఫీస్ - ఇంటి నిర్మాణం కోసం భూమి కొనుగోలు చేసిన పవన్...

ఠాగూర్
బుధవారం, 6 నవంబరు 2024 (08:56 IST)
తన ఇంటితో పాటు క్యాంపు కార్యాలయం నిర్మాణం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ఆయన ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఎన్నికల ముందు పిఠాపురం ఇల్లు కట్టుకుంటానని అక్కడి ప్రజలకు జనసేనాని మాటిచ్చారు. అందులే భాగంగానే జూలై ఇల్లింద్రాడ, భోగాపురంలలో వరుసగా 2.08, 1.44 ఎకరాలు చొప్పున స్థలాలను కొనుగోలు చేశారు. 
 
సోమవారం పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్... గతంలో కొన్న చోటే రో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసారు. దీన్ని రిజిస్ట్రేషన్ ఆయన తరపున రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ మంగళవారం పూర్తి చేశారు. త్వరలోనే ఈ స్థలంలో ఇంటితో పాటు క్యాంపు కార్యాలయ నిర్మాణాలను పవన్ కళ్యాణ్ చేపట్టనున్నారు. 
 
జగన్‌ను నేను అమ్మనే.. వాడు నాకు కొడుకే.. విజమయ్మ 
 
కుటుంబంలో భిన్నాభిప్రాయుల సహజమేనని దివంగత నేత వైఎస్ఆర్ సతీమమి వైఎస్ విజయమ్మ అన్నారు. తమ కుటుంబం గురించి సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం బాధ కలిగిస్తుందన్నారు. తమను అడ్డంపెట్టుకుని రాజకీయాల కోసం ఇంతగా దిగజారుతారా అని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె మంగళవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కుటుంబంలో భిన్నాభిప్రాయలు సహజమే. అంత మాత్రాన ఆ తల్లికి కుమారుడు కాకుండా పోతాడా, కొడుక్కి అమ్మ కాకుండా పోతుందా, ఓ అన్నకు చెల్లికి కాకుండా పోతుందా చెల్లికి అన్నకాకుండా పోతాడా అని విజయమ్మ వ్యాఖ్యానించారు. 
 
మా పిల్లల్ని చాలా సంస్కారవంతంగా పెంచాం. మా కుటుంబంపై సోషళ్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం చాలా బాధ కలిగిస్తుంది. షర్మిల కూతురే కాదంటున్నారు. నా మనవలన దగ్గరకు వెళితే అదో కథ. రెండేళ్ల క్రితం జరిగిన నాకు ప్రమాదానికి నా కుమారుడు జగన్‌కు ముడిపెడుతున్నారు. మమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ది కోసం ఇంత దిగజారుతారా అని విజయమ్మ ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో సందేశంలో ఆమె తన తన ఆ వేదనను వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

నా అంచనా నిజమైంది, సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ పై పి.జి. విందా

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments