Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై సిఎస్ సమీక్ష.

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (12:32 IST)
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సంబంధిత శాఖల కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ కేటగిరీల సిబ్బందికి సంబంధించిన సర్వీస్ నిబంధనలు, డెలిగేషన్ ఆఫ్ పవర్స్, బయోమెట్రిక్ హాజరు వంటి పలు అంశాలపై సిఎస్ సమీక్షించారు.
 
ఈ సందర్భంగా సిఎస్ ఆదిత్యానాథ్ దాస్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించి త్వరితగతిన బిజినెస్ రూల్స్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై త్వరితగతిన ఒక ముసాయిదా నివేదికను సిద్ధం చేయాలని కోరారు. 
 
అంతేగాక సంబంధిత శాఖల వారీగా ఆయా సిబ్బందికి జాబ్ చార్ట్‌ను రూపొందించాలని స్పష్టం చేశారు. అన్ని అంశాలకు సంబంధించి విలేజ్ సెక్రటేరియట్ మాన్యువల్ రూపొందించాలని సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆయా కార్యదర్శులను ఆదేశించారు. 
 
ఇంకా ఈ సమావేశంలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన సర్వీస్ నిబంధనలు తదితర అంశాలపై సిఎస్ సమీక్షించారు. అంతకుముందు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించి వివిధ ఫంక్షన్షరీల వారీ రూపోందించిన విధివిధానాలను వివరించారు.
 
ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ భార్గవ, నీరబ్ కుమార్ ప్రసాద్, అనంతరాము, ముఖ్య కార్యదర్శులు బి.రాజశేఖర్, కుమార్ విశ్వజిత్, గోపాల కృష్ణ ద్వివేది, ఎఆర్ అనురాధ, వి. ఉషారాణి, రిజ్వీ, పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments