Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 20 వేల పాజిటివ్ కేసులు.. 100 వేల ఆక్సీ కాన్సంట్రేటర్ల

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (18:50 IST)
ఏపీలో కరోనా విజృంభణ విశృంఖలంగా కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 92,231 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,937 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 3,475 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
ఆ తర్వాత స్థానంలో ఉన్న చిత్తూరు జిల్లాలో 3,063 కేసులు గుర్తించారు. అదే సమయంలో 20,811 మంది కరోనా నుంచి కోలుకోగా, 104 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృత్యువాతపడ్డారు.
 
రాష్ట్రంలో ఇప్పటిదాకా 15,42,079 పాజిటివ్ కేసులు నమోదు కాగా.... 13,23,019 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఇంకా 2,09,156 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 9,904కి పెరిగింది.
 
ఇదిలావుండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏపీకి 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించింది. డబ్ల్యూహెచ్ఓ అందించిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఏపీలోని కొవిడ్ కేర్ సెంటర్లలో అత్యవసర చికిత్సలో భాగంగా ఉపయోగించనున్నారు.
 
కాగా, నిన్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ సీఎం జగన్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల అంశాన్ని ప్రస్తావించారు. 18,500 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 
 
ఇవేకాకుండా జిల్లా స్థాయిలో 53 ఆక్సిజన్ ప్లాంట్లు, 50 క్రయోజెనిక్ ట్యాంకులు, 10 వేల డీ టైప్ సిలిండర్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అందుకోసం రూ.309 కోట్ల మేర వెచ్చిస్తున్నామని సీఎం జగన్ సభకు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments