Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది బీజేపీ సొల్లు స‌భ‌! సోమును ఎవ‌రికైనా చూపించండి!!

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (15:49 IST)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ సెటైర్లు వేశారు. విజయవాడలో బీజేపీ నిర్వహించింది ప్రజాగ్రహ సభ కాదు... బీజేపీ సొల్లు సభ అని వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు ఈసారి కూడా బీజేపీ సోల్లే చెప్పారు తప్ప, అసలు విషయాలు మాట్లాడలేద‌న్నారు. సోము వీర్రాజును ఒకసారి మానసిక వైద్యుడికి చూపించాలని స్థానిక బీజేపీ నేతలకు సూచించారు. 
 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి అస్సలు బీజేపీ ఏం న్యాయం చేసిందో చెప్పే దమ్ము సోము వీర్రాజుకు ఉందా? అని ప‌ద్మ‌శ్రీ ప్ర‌శ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, అమరావతి రాజధానిని గాలికి వదిలేసిన బీజేపీ సొంత డబ్బా కొట్టుకోవడంలో మాత్రం ఫస్ట్ ఉంద‌న్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మూడు సంవత్సరాల్లో అమరావతి పూర్తి చేస్తామని చెప్పడం హాస్యాస్పదం అని ప‌ద్మ‌శ్రీ ఎద్దేవా చేశారు. 7 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజధాని నిర్మాణానికి మట్టి, నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకుంద‌ని, చివ‌రికి 70 రూపాయలకి, 50 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తామని సోము వీర్రాజు అనడం చూస్తే జాలేస్తోంద‌న్నారు. అధికారం కోసం బీజేపీ నేతలు ఎంతకైనా దిగజారతారని ప్రజలకు అర్థమైంద‌న్నారు.
 
 
మద్యం తాగితే జీవితాలు పాడైపోతాయి అని ప్రజలకు చెప్పాల్సిన వ్యక్తి, తామే తక్కువ ధరకు ఇస్తాం తాగి నాశనమైపొండి అని చెబుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అదే 70 రూపాయలకి లీటర్ పెట్రోల్ ఇస్తాం అనే ధైర్యం బీజేపీ నాయకులకు ఉందా? అని సుంక‌ర ప్ర‌శ్నించారు. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుంటే, సోము వీర్రాజు ఏ కలుగులో దాక్కున్నార‌ని అడిగారు. వెంకన్న సాక్షిగా మా రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని సోము వీర్రాజు ప్రధాని మోదీని ప్రశ్నించాల‌ని డిమాండు చేశారు. సోము వీర్రాజు ఉత్తరకుమార ప్రగల్భాలు కట్టిపెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల‌ని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments