ప్రభుత్వం చేసిన మంచికి దేవుడి చల్లని దీవెనలు : సీఎం జగన్

Webdunia
ఆదివారం, 26 జూన్ 2022 (17:50 IST)
తన సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆత్మకూరు ఓటర్లు మద్దతుగా నిలిచారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన ఘనవిజయం సాధించిన విషయం తెల్సిందే. 
 
ఆదివారం వెల్లడైన ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌పై 82,742 ఓట్ల మెజారిటీతో విక్రమ్‌రెడ్డి గెలుపొందారు. ఈ గెలుపుపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులతో విజయం సాధించామని ట్విటర్‌లో పేర్కొన్నారు. 
 
'ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్‌కు నివాళిగా ఆత్మకూరులో 83వేల భారీ మెజార్టీతో విక్రమ్‌ను దీవించిన ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, సోదరుడికి, స్నేహితుడికి, అవ్వకు, తాతకు... పేరు పేరునా ధన్యవాదాలు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష' అని జగన్ కామెంట్స్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments