Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆత్మకూరు ఉప ఎన్నిక : 80 వేలకు పైగా మెజార్టీతో విక్రమ్ రెడ్డి గెలుపు

mekapati vikram reddy - jagan
, ఆదివారం, 26 జూన్ 2022 (15:22 IST)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ పోలింగ్ ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. అలాగే, పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ కూడా పోటీకి దూరంగా ఉంది.
 
మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ వైకాపా తరపున మేకపాటి విక్రమ్ రెడ్డిని వైకాపా బరిలోకి నిలిపింది. ఈ నెల 23వ తేదీన పోలింగ్ జరుగగా, ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 20 రౌండ్లపాటు జరిగిన ఓట్ల లెక్కింపులో విక్రమ్ రెడ్డి 82 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 
 
ఈ గెలుపును అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తన అన్న మేకపాటి గౌతంరెడ్డి పేరును నిలబెట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు. తమ కుటుంబంపై మరోసారి నమ్మకం ఉంచినందుకు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. 
 
ఈ ఉప ఎన్నిక పోలింగ్ చాలా పారదర్శకంగా జరిగిందన్నారు. పైగా, తన విజయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేనని చెప్పారు. ఈ ఉప ఎన్నికల తీర్పుతో సీఎం జగన్‌కు ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని మరోమారు నిరూపితమైందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మునుపెన్నడూ లేని విధంగా అమలవుతున్నాయని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోనే గూఢచారి.. అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు