Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోనే గూఢచారి.. అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు

Advertiesment
imran khan
, ఆదివారం, 26 జూన్ 2022 (14:49 IST)
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ హత్యకు కుట్రపన్నుతున్నారంటూ ఇటీవలి కాలంలో విస్తృతంగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఆయన హత్యకు కుట్ర పన్నుతున్నారనే అనుమానంతో ఆయన ఇంట్లోని సిబ్బందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. 
 
ఈ విషయాన్ని పాక్‌లోని ఏఆర్‌వై న్యూస్‌ వెల్లడించింది. ఇమ్రాన్‌ బంగ్లాలోని బెడ్‌రూమ్‌లో రహస్య నిఘా పరికరాలు అమర్చేందుకు అక్కడ పనిచేసే సిబ్బంది డబ్బు తీసుకొన్నారు. కానీ, అక్కడే పనిచేసే మరో సిబ్బంది ఈ విషయాన్ని గ్రహించి భద్రతా సిబ్బందికి తెలియజేయడంతో.. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫెడరల్‌ పోలీసులకు అప్పజెప్పారు.
 
ఇమ్రాన్‌ ఖాన్‌పై హత్యకు కుట్ర జరుగుతోందని వార్తలు వస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ప్రచారంతో ఇప్పటికే ఆయన నివాసం వద్ద భద్రతను పెంచారు. తాజా ఘటనపై పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ నాయకుడు షాబాజ్‌ గిల్‌ మాట్లాడుతూ 'ఇప్పటికే ఇమ్రాన్‌కు ప్రాణహాని ఉందన్న విషయాన్ని ప్రభుత్వం సహా అన్ని భద్రతా ఏజెన్సీలకు తెలియజేశామన్నారు. 
 
ఇమ్రాన్‌ ఇంట్లో గదులను శుభ్రపర్చే సిబ్బందికి కొందరు డబ్బులు ఇచ్చి నిఘా పరికరాలు అమర్చాలని పురమాయించినట్లు తెలిసింది. ఇది హేయమైన, దురదృష్టకర చర్య. తాజాగా పట్టుబడిన సిబ్బంది పలు విషయాలను వెల్లడించాడు. కానీ, వాటిని ఇప్పుడు పంచుకోలేం' అని వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంకలో నానాటికీ పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు