మరో సీనియర్ ఐఎఎస్ పైన దృష్టి పెట్టిన సిఎం... ఎవరు?

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (18:56 IST)
ఎపి సిఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసి చర్చకు తెరలేపారు ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి. తాజాగా సిఎం మరో నిర్ణయం కూడా తీసేసుకున్నారట. అది కూడా ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ టిటిడి కార్యనిర్వహణాధికారిని మార్చాలని నిర్ణయానికి వచ్చేశారట. తెలుగుదేశం పార్టీ హయాంలో టిటిడి ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. 
 
మహారాష్ట్రకు చెందిన ఈయన డిప్యుటేషన్ పైన టిటిడి ఈఓగా వచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఐదు నెలల పాటు ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. కానీ తిరుమల ప్రత్యేక అధికారి పోస్టును మాత్రం మార్చేశారు. గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న ధర్మారెడ్డికి ఆ పోస్టును కట్టబెట్టారు.
 
ప్రస్తుతం ఈఓ పోస్టును కూడా అదేవిధంగా సీనియర్ ఐఎఎస్ అధికారి జెఎస్వీ ప్రసాద్‌కు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారట సిఎం. త్వరలోనే దీనికి సంబంధించిన జిఓ కూడా వెలవడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుసగా కీలక పోస్టుల్లో ఉన్న ఐఎఎస్‌లను సిఎం మారుస్తూ వస్తుండటం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు దారితీస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments