Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ విజ‌య‌సాయితో గ్యాప్ మ‌రింత పెరిగిందా? ఢిల్లీ టూర్లో ఏం జ‌రిగింది?

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (17:59 IST)
సీఎం జ‌గ‌న్, ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య దూరం ఏర్ప‌డింద‌ని చాలా రోజుల క్రితం రాజ‌కీయ ఊహాగానాలు వ‌చ్చాయి. అవి కొంత వ‌ర‌కు నిజ‌మేన‌ని అప్ప‌టి నుంచి జ‌రిగిన కొన్ని ప‌రిణామాల వ‌ల్ల తేలింది. ఆయ‌న్ని అమ‌రావ‌తికి గాని, తాడేప‌ల్లి క్యాంప్ ఆఫీసుకు గాని రాకుండా, మొత్తం ఢిల్లీలోనే ఉంచేశార‌నే అభిప్రాయం వ్య‌క్తం అయింది. దీనికి త‌గిన‌ట్లే, ఎంపీ విజ‌య‌సాయి, సీఎం జ‌గ‌న్ వ్య‌క్త‌గ‌త ప‌ర్య‌ట‌న‌ల‌కు, ఇడుపుల‌పాయ ప‌ర్య‌ట‌న‌ల‌కు కూడా దూరం అయ్యారు. 
 
 
అయితే, ఇపుడు ఢిల్లీలో కూడా ఎంపీ విజ‌య‌సాయి సీఎం జ‌గ‌న్ కి దూరం అయిపోయార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వారిద్ద‌రి మ‌ధ్య దూరం మ‌రింత పెర‌గిందంటున్నారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో స్పష్టంగా కనిపించిన గ్యాప్ క‌నిపించిందంటున్నారు. ఢిల్లీ టూర్ లో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం క‌నిపించ‌లేదంటున్నారు. సీఎం జ‌గ‌న్ విజయసాయితో ముఖాముఖి ఎక్క‌డా మాట్లాడలేద‌ని, రాత్రి డిన్నర్ కు కూడా విజయసాయిరెడ్డిని దూరంపెట్టార‌ని చెపుతున్నారు. కేంద్ర మంత్రి సింధియాతో మీటింగ్ లోనూ విజయసాయిరెడ్డిని బయటకు పంపార‌నే వార్త‌లు ఢిల్లీలో వినిపిస్తున్నాయి. 
 
 
సీఎం జగన్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కేంద్ర నేత‌ల అపాయింట్ మెంట్లు కూడా స‌రిగా ఫిక్స్  చేయలేకపోవడంపై విజయసాయిపై అసహనం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఎంపీలు వేమిరెడి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డిల‌కే సీఎం జగన్ ప్రాధాన్యం ఇచ్చార‌ని చెపుతున్నారు. ఢిల్లీ వ్యవహారాలను నడిపిస్తున్న వేమిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి అంతా స‌మ‌న్వ‌యం చేశార‌ని స‌మాచారం. రాష్ట్రంలోనూ సాయిరెడ్డి ప్రాధాన్యానికి ఎపుడో కళ్లెం వేశారు. ఉత్తరాంధ్ర వ్యవహారాల నుంచి సాయిరెడ్డిని పక్కన పెట్టిన జగన్, ముఖ్య‌ బాధ్య‌త‌ల‌ను స‌ల‌హాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైనే పెట్టారు. ప్రెస్ మీట్లు, ఉద్యోగ సంఘాలతో చర్చలు చూస్తున్నది సజ్జలనే. అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గించ‌డం క‌నిపిస్తోంద‌ని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డైరెక్ట‌ర్సే నాకు గురువులు : మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడ‌

వంద రోజుల పాటు ఆలరించిన రియాలిటీ షో ... నేడు బిగ్‌బాస్ టైటిల్ ప్రకటన

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments