Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రికి ఆత్మీయ వీడ్కోలు

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (13:44 IST)
మూడు రోజుల జిల్లా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విజయవాడకు బయలుదేరారు. జగన్ మోహన్ రెడ్డికి శనివారం కడప విమానాశ్రయంలో జిల్లా నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. 
 
 
శనివారం ఉదయం పులివెందులలో క్రిస్మస్ వేడుకలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న ఆయన  అనంతరం హెలికాఫ్టర్ లో ఉదయం 11.25 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుండి ప్రత్యేక విమానంలో 11.35 గంటలకు విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటుతో పాటు ఆయన ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్, సహాయ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డిలు ఉన్నారు. 

 
కడప విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు పలికిన వారిలో   జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, డిఐజీ వెంకట్రామిరెడ్డి లతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకీయా ఖానమ్, ఎమ్మెల్సీలు డిసి గోవిందరెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రఘురామిరెడ్డి, డా.సుధ, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు అంబటి కృష్ణారెడ్డి, జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు, వైసీపీ నేత మాసీమ బాబు, జేసీలు గౌతమి (రెవెన్యూ), సాయికాంత్ వర్మ (అభివృద్ధి) గౌతమి, ధ్యానచంద్ర (హౌసింగ్), డిఎస్పీ వెంకట శివారెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments