Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంకాయపాడులో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (12:46 IST)
ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడుకు సమీపంలోని యర్లపాడు మండలం వంకాయలపాడులో గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ యూనిట్‌ను ఐటీసీ సంస్థ రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించింది. మొత్తం 6.2 ఎకరాల విస్తీర్ణంలో సుగంధ ద్రవ్యాల ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేసే విధంగా ఈ స్పైసెస్ పార్కును అభివృద్ధి చేశారు. 
 
ఈ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, ఈ యూనిట్ వల్ల 14 వేల మంది రైతులు లబ్ధి పొందవచ్చన్నారు. పైగా, రెండో యూనిట్‌ను కూడా సద్ధం చేసేందుకు ఐటీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. ఈ యూనిట్ ద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. ఏపీ రైతులకు అండగా నిలబడేందుకు ఐటీసీ కంపెనీ ముందుకు రావడం సంతోషంగా ఉన్నారు. 
 
అదేసమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) కూడా రైతు జీవితాల్లో మార్పులు తీసుకొస్తున్నాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్ల కాలంలో ఏపీలో అగ్రస్థానంలో నిలిచిందని సీఎం జగన్ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments