Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారావారి పల్లెలో భోగిమంటలు.. చంద్రబాటు ఇంట సందడేసందడి..

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇంటే సంక్రాంతి సందడి అంతా నెలకొనివుంది. చంద్రబాబు దంపతులతో పాటు.. హీరో బాలకృష్ణ దంపతులు కూడా చిత్తూరు జిల్లా నారావారి పల్లెకు చేరుకుని భోగి మంటలు వేశారు.

Webdunia
ఆదివారం, 14 జనవరి 2018 (11:46 IST)
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇంటే సంక్రాంతి సందడి అంతా నెలకొనివుంది. చంద్రబాబు దంపతులతో పాటు.. హీరో బాలకృష్ణ దంపతులు కూడా చిత్తూరు జిల్లా నారావారి పల్లెకు చేరుకుని భోగి మంటలు వేశారు. 
 
ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలసి తిరుమల చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, హీరో బాలకృష్ణ దంపతులు, మంత్రి లోకేష్ దంపతులు తదితరులు తిరుమలకు వచ్చారు. 
 
కాగా, శనివారం సాయంత్రం నారావారి పల్లెకు వచ్చిన సీఎం రాత్రి అక్కడే బస చేశారు. ఆదివారం వేకువజామున భోగి మంటలు వేసిన చంద్రబాబు, బాలకృష్ణల ఫ్యామిలీ సభ్యులు భోగి నీళ్ళతో తలస్నానం చేసి అక్కడ నుంచి నేరుగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 
 
సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు చంద్రబాబు, బాలకృష్ణ దంపతులు శనివారమే నారావారిపల్లెకు వెళ్లారు. అనంతరం ఆదివారం తెల్లవారుజామున జరిగిన భోగి వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్లారు. కాగా... చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలకు టీటీడీ అధికారులు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికి, దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments