Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2 వేల నోటుతో పేదలకు ఉపయోగం లేదు.. రద్దు చేయండి : చంద్రబాబు

పెద్దనోట్లు రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం చేసిన ప్రకటన వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని, కొత్త రూ.2వేల నోట్లతో పేదలకు ఎలాంటి ఉపయోగం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందువల్ల ఈ నోట

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (11:41 IST)
పెద్దనోట్లు రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం చేసిన ప్రకటన వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని, కొత్త రూ.2వేల నోట్లతో పేదలకు ఎలాంటి ఉపయోగం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అందువల్ల ఈ నోటును రద్దు చేసి.. రూ.50, రూ.100 నోట్లను అధిక సంఖ్యలో విడుదల చేయాలని కోరారు. అదేసమయంలో ప్రతి ఒక్కరూ బ్యాంక్‌ ఖాతాలు ప్రారంభించుకోవాలని సూచించారు. దొంగలు, అవినీతిపరుల భరతం పట్టేందుకుకే నోట్ల రద్దు అని వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే ఉంటాయని చంద్రబాబు వెల్లడించారు. 
 
మరోవైపు... పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కల్లోల పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రజల్లో ఓర్పు, సహనం నశిస్తోందంటూ వ్యాఖ్యానించారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి రోజులు గడుస్తున్నా పరిస్థితులను చక్కదిద్దరేమంటూ ప్రశ్నించారు. పైగా ఒక సమస్య ఇన్నాళ్లపాటు పరిష్కారం కాకపోవడాన్ని తొలిసారి చూస్తున్నాను. ఈ పరిస్థితితో నాకే అసహనంగా ఉంది. ప్రజల సహనాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. 
 
నోట్ల రద్దు అంశంపై ఆయన ఆదివారం కలెక్టర్లు, ఆర్బీఐ, ఎస్ఎల్‌బీసీ, ఆర్థిక శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చెలామణిలోకి తెచ్చిన రూ.2000 నోట్లను రద్దు చేసి.. తిరిగి రూ.200, రూ.100 నోట్ల కరెన్సీని ప్రవేశపెట్టాలన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నిరుపేదల నుంచి అన్నివర్గాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చిన రెండువేల కోట్లలో వంద నోట్లు రూ.400 కోట్లు ఉన్నాయని తెలిపారు.
 
అన్ని బ్యాంకులు సమన్వయంగా పనిచేయాలని, ప్రజలు ఇబ్బందులను బ్యాంకర్లు, అధికారులు గమనించి, తక్షణం ఉపశమనం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని బ్యాంకర్లకు నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇవ్వాలని, సకాలంలో దిశానిర్దేశం చేసే సీనియర్‌ అధికారులను జిల్లాల్లో నియమించాలని బ్యాంకర్లకు సూచించారు. జన్‌ధన్ ఖాతాలు, రూపే కార్డులను తక్షణం క్రియాశీలం చేయాలన్నారు. సమన్వయంతో పనిచేయని బ్యాంకర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్ చిత్రం లేటెస్ట్ అప్ డేట్

తెలుగు అమ్మాయిలంటే అంత సరదానా! ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ పై మండిపాటు

నన్నెవరూ ట్రాప్‌లో పడేయలేరు, నాతో పెదనాన్న వున్నాడు: మోనాలిసా భోంస్లే

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments