Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (19:24 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయనపై నాలుగు కేసులు నమోదు చేయగా, తాజాగా నమోదు చేసిన కేసుతో కలిసి చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల సంఖ్య ఐదుకు చేరింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయని ఏపీ ఎండీసీ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. 
 
ఇందులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమామహేశ్వర రావు పేర్లను చేర్చారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా వ్యవహరించారని ఏపీఎండీసీ చేసిన ఫిర్యాదును సీఐడీ స్వీకరించింది. ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్న చంద్రబాబుపై ఇది ఐదో కేసు కావడం గమనార్హం. 
 
కాగా, చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం అనుమతుల మంజూరు కేసులను నమోదు చేసిన విషయం తెల్సిందే. వీటిలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయగా, మొత్తం 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై ఆయన బుధవారం విడుదలైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments