Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు మైక్ ఇవ్వలేదనీ టీడీపీ వాకౌట్.. సభకు దూరం

Webdunia
గురువారం, 25 జులై 2019 (13:21 IST)
శాసనసభ సమావేశాలను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గురువారం బహిష్కరించింది. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడటానికి అవకాశమివ్వనందుకు నిరససనగానే నేటి సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. 
 
అంతకుముందు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని తెదేపా సభ్యులు వాకౌట్‌ చేశారు. రైతు సమస్యలు, పెట్టుబడి సాయంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మైక్‌ ఇవ్వాలంటూ సభలో నినాదాలు చేసిన సభ్యులు అనంతరం సభ నుంచి బయటకు వెళ్లారు.
 
అంతకుముందు గురువారం అసెంబ్లీ ప్రారంభానికి ముందే సభాహక్కులు కాపాడాలంటూ శాసనసభ ప్రధాన ద్వారం వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. 
 
తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సహా పార్టీ శాసనసభ్యులందరూ ఆందోళనలో పాల్గొన్నారు. తెదేపా శాసనసభ ఉపనేతలపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments