Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్‌వి అన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే : టీడీపీ మహిళా నేత తంగిరాల సౌమ్య

Advertiesment
జగన్‌వి అన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే : టీడీపీ మహిళా నేత తంగిరాల సౌమ్య
, మంగళవారం, 23 జులై 2019 (16:12 IST)
మాట తప్పను మడమ తిప్పను అన్న మీ ఉత్తర కుమార ప్రగల్భాలకు మోస పోయిన ప్రజలు పశ్చతాప పడుతున్నారంటూ వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మహిళా నేత తంగిరాల సౌమ్య ఆరోపించారు. ఇదే అంశంపై ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 
 
ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాను అని చెప్పిన మీవు వారి ఆర్ధిక ఇబ్బందులను ఆసరా చేసుకొని ఆశ పెట్టి ఓట్లు దండుకున్నావ్, మీరు సీఎంకాగానే ఆ మాట తప్పవు అది మడమ తిప్పటం కదా జగన్ అంటూ నిలదీశారు. ఇదేనా నువ్వు నిత్యం చెప్పే విశ్వానీయత. నీ మాయ మాటలు నమ్మిన మహిళలు నేడు మనోవ్యధకు గురవుతున్నారన్నారు. వారి ఆగ్రహాన్ని నువ్వు చవి చూడక తప్పదని మండిపడ్డారు. 
 
అమ్మ ఒడి ద్వారా ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు ఇస్తాను అన్న మీరు ఇంటికి ఒకరు అని చెప్పడం ద్వారా మరో పిల్లవాడికి విద్య లేకుండా చేస్తారా అని నిలదీశారు. ఇది మడమ తిప్పడం కదా? మీ అవినీతి చరిత్ర తెలిసి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సైతం వెనక్కి పోయిందని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన అవమానమేని అన్నారు. 
 
పరిశ్రమల స్థాపన దిశగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలన మీ అడుగు పడగానే వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్ళటంతోపాటు నువ్వు అనుసరిస్తున్న విద్యుత్ విధానాల వల్ల అప్రకటిత కరెంటు కోతలతో ఉన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితికి వస్తున్నాయన్నారు. వికసించే పువ్వు లాంటి ఆంధ్రప్రదేశ్ నీ కబంధ హస్తాలతో చిదిమి వేస్తున్నావంటూ మండిపడ్డారు. 
 
అభివృద్ధిలో కుంటుపడుతున్న వెనకడుగు వేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను గాడిలో పెట్టేందుకు అసెంబ్లీలో మా శాసన సభ్యులు పోరాటం చేస్తూ ఉంటే తట్టుకోలేక సస్పెండ్ చేయడం హేయమైన చర్య. మీ అక్రమ పాలన నుండి ప్రజలను కాపాడేందుకు తెలుగుదేశం శ్రేణులు నిరంతరం పోరాటాలు చేస్తాయి. ఎప్పటికైనా ప్రజాకోర్టులో మిమ్మలను దోషిగా నిలిపి రాష్ట్రాన్ని పరిరక్షణ చేసేందుకు మేము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేపను బిర్యానీలో వేశాడు.. బల్లి అని మోసం చేశాడు.. చివరికి దొరికిపోయాడు..