Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (11:18 IST)
ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఆగస్టు 3న విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 
 
సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు.ఈ ఏడాది జులై 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 
 
పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలకు రెండు లక్షలకు పైగా  విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బాలురు 1,09,413 మంది, బాలికలు 82,433 మంది ఉన్నారు. ఫలితాల్లో బాలురు 60 శాతం పైగా ఉత్తీర్ణులు కాగా.. బాలికలు 68  శాతం ఉత్తీర్ణులయ్యారు. 
 
పరీక్షలకు మొత్తం 1,91,896 మంది  పరీక్ష రాస్తే  1,31,233 మంది పరీక్ష  ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. ఇక అత్యల్పంగా పశ్చిమగోదావరి  జిల్లాలో  46.66  శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
 
సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని 2022–ఏప్రిల్‌ రెగ్యులర్‌ బ్యాచ్‌ విద్యార్థులతో సమానంగా పరిగణించనుంది. గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఎటువంటి పరీక్షలను నిర్వహించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments