Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టు గేట్ల‌కు హైడ్రాలిక్ సిలెండ‌ర్ల ఏర్పాటు ప్ర‌క్రియ ప్రారం‌భం

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:09 IST)
పోలవరం ప్రాజెక్టులో మరో అద్భుతం చోటుచేసుకుంది. గేట్లకు హైడ్రాలిక్ సిలెండర్ల ఏర్పాటు ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. జర్మనీ నుండి పోలవరం ప్రాజెక్ట్‌కు హైడ్రాలిక్ సిలిండర్లు చేరుకున్నాయి. ఈ రోజు మొదటి గేటుకు సిలిండర్లును మెగా ఇంజినీరింగ్ సంస్థ అమర్చింది. ఒక్కో గేటుకు 2 సిలిండర్లను జర్మనీకి చెందిన ఇంజినీర్లు అమర్చుతున్నారు.

48 గేట్లకు 96 సిలిండర్లు మెగా ఇంజనీరింగ్ సంస్థ అమర్చనుంది. దేశంలోనే తొలిసారిగా హైడ్రాలిక్ సిలిండర్లతో గేట్లను ఎత్తే టెక్నాలజీని వినియోగిస్తున్నారు. పోలవరం గేటు బరువు 300 టన్నులు ఉటుందని అధికారులు తెలిపారు. గేట్లను పైకి, కిందకు దించడానికి ఎత్తడానికి వీలుగా ఒక్కో గేటుకు 200 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల రెండు హైడ్రాలిక్ సిలెండర్లను గేటుకు రెండు వైపులా అమర్చుతామని అధికారులు తెలిపారు.

స్పిల్‌వేకు 48 గేట్లు ఉండగా, ఇప్పటి వరకూ 29 గేట్లనే అమర్చామని అధికారులు చెబుతున్నారు. గేట్లకు హైడ్రాలిక్‌ సిలెండర్లు, పవర్‌ప్యాక్‌లు అమర్చే పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఈ గేట్లు ప్రపంచంలోనే అతి పెద్దవని తెలిపారు. 52 మీటర్ల ఎత్తున స్పిల్‌వే ఫిల్లర్స్‌ నిర్మాణం పూర్తయిందని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments