Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో అశ్ర‌ద్ధ వ‌ద్దు : విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో అశ్ర‌ద్ధ వ‌ద్దు : విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్
, మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (14:00 IST)
విజ‌య‌వాడ నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబందించి చేపట్టాల్సిన, చేపట్టిన అంశాలపై అశ్ర‌ద్ధ వ‌ద్ద‌ని, ఎన్నికలు సమర్ధవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు.

నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులతో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సమీక్షించి ఎన్నికల ప్రక్రియ సమర్ధవంతంగా పూర్తి చేసేలా ప్రతి ఒక్కరు సమిష్టిగా తమకు కేటాయించిన విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.

ఈ సందర్భంలో పోలింగ్ స్టేషన్ల వారిగా ఓటర్ల జాబితాను వెబ్‌సైట్ నందు పొందుపరచాలని, అన్ని పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ స్టేషన్స్ నందు అవసరమైన అన్ని మౌలిక వసతులు పర్యవేక్షించాలని, స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.

ఈ సందర్భంలో పోలింగ్ నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లను సమకూర్చుకోవటం, పోలింగ్ అధికారులకు అందించు సామాగ్రితో పాటు ఎలక్షన్ మెటిరియాల్ ఒక సంచిలో మరియు బాలెట్ బాక్స్‌లను తీసుకువెళ్లేలా ప్రత్యేకంగా గన్ని బ్యాగ్‌లను సమకూర్చునట్లుగా చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు.

అదే విధంగా పోస్టల్ బ్యాలెట్‌పై దృష్టి సారించి తగిన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్, మోడల్ కోడ్ అఫ్ కాండక్ట్, స్టాటిక్ సర్వే, సింగల్ విండో క్లియరెన్స్ సెల్, మీడియా మోనిటరింగ్ సెల్, కంప్లైంట్ సెల్ మొదలగు అంశాలపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేస్తూ, ప్రతి రోజు వాటికీ సంబందించి రిపోర్ట్ సమర్పించాలన్నారు.

ఎన్నికల ప్రక్రియ అంతయు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశిలనకు తగిన ఏర్పాట్లు సిద్ధం చేయాలని, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్ల వద్ద అవసరమైన మెడికల్ క్యాంపులు  ఏర్పాటుకు ప్రణాళికను సిద్దం చేసుకోవాలని ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో ఆ ఆరు రాష్ట్రాల్లో కరోనా.. అంతా నిర్లక్ష్యమే కారణం