Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో రేపు నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు

ఏపీలో రేపు నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు
, శనివారం, 20 ఫిబ్రవరి 2021 (19:53 IST)
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లు, 161 మండలాల పరిధిలో పోలింగ్‌ జరగనుంది. 3,299 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు ఇప్పటికే 554 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

మరో రెండు చోట్ల సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 2,743 స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 33,435 వార్డు సభ్యులకు గాను 10,921 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 91 చోట్ల వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు.

మిగిలిన 22,423 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో మొత్తంగా 67,75,226 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ నిమిత్తం నాలుగో దశలో 28,995 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

6,047 సమస్యాత్మక, 4,967 అతి సమస్యాత్మక ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఎన్నికల విధులకు 53,282 మంది పోలింగ్‌ సిబ్బందిని ఎన్నికల సంఘం నియమించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

1200 ఎకరాలు.. రూ. 6 వేల కోట్లు, కలకలం రేపుతున్న వామనరావు పోస్ట్...