నెల్లూరులో ప్రేమోన్మాదం.. ప్రేయసిని గన్‌తో షూట్ చేశాడు.. తాను కూడా..?

Webdunia
సోమవారం, 9 మే 2022 (19:05 IST)
నెల్లూరులో ప్రేమోన్మాదం బయటపడింది. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో.. ప్రియురాలిని యువకుడు గన్‌తో కాల్చాడు. అనంతరం ప్రేమికుడు కూడా తనను కాల్చుకుని చనిపోయాడు. యువతి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. 
 
వివరాల్లోకి వెళ్తే.. తాటిపర్తికి చెందిన మాలపాటి సురేష్ రెడ్డి, పొలకూరు కావ్య సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గతంలో బెంగళూరులో పనిచేసేవారు.. కానీ వర్క్‌ఫ్రమ్‌ హోం కావడంతో ఊర్లోనే ఉంటున్నారు. 
 
సురేష్, కావ్యలు తమ ప్రేమ విషయం ఈ మధ్యే పెద్దలకు తెలిసింది. తన బంధువుల ద్వారా కావ్య తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపారట. సురేష్‌తో పెళ్లికి కావ్య కుటుంబసభ్యులు అంగీకరించలేదు.  సోమవారం కావ్యను ఇచ్చి పెళ్లి చేయాలని మరోసారి ఒప్పించే ప్రయత్నం చేశాడు.
 
ఒప్పుకోకపోతే తుపాకీతో బెదిరించైనా ఒప్పించాలనే.. తన వెంట తుపాకీ కూడా తీసుకొని వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఆవేశంతో ఆ తర్వాత కావ్యపై కాల్పులు జరిపాడు. 
 
ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరూ మృతిచెందడంతో.. విషాదంగా మారింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాందినీ గాయంతో కాలు నొప్పి ఉన్నా డాకూ మహారాజ్ లో పరుగెత్తే సీన్స్ చేసింది : బాబీ

Dharmendra Health Update: ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా వుంది.. ఇషా డియోల్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments