Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి రెయిన్‌ అలర్ట్.. మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

Webdunia
మంగళవారం, 26 అక్టోబరు 2021 (16:05 IST)
ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించిదని తెలిపింది. పశ్చిమ దిశగా ఇది ప్రయాణించనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. 
 
దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్‌ ఉన్నట్లు అంచనా వేసింది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించినట్లు తెలిపింది.
 
రాయలసీమలో ఇవాళ, రేపు ఒకటిరెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురవనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
ఇక దక్షిణా కోసాంధ్రలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్‌ ఉంది. ఎల్లుండి కూడా మోస్తరు వర్షాలు ఉరుములు, మెరుపులతో కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరకోస్తాంధ్ర, యానాంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments