Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి నిర్మాణం - జంగిల్ క్లియరెన్స్.. పనులు ప్రారంభం (video)

సెల్వి
మంగళవారం, 19 నవంబరు 2024 (11:44 IST)
APCRDA
అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.15000 కోట్లు సాయం సాధించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని నిర్మాణ పనులలో వేగం పెంచింది. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక యంత్రాలు ఉపయోగిస్తూ వేగంగా జంగిల్ క్లియరెన్స్ జరుపుతోంది. 
 
భారీ మానులను సైతం అమరావతిలో వినియోగిస్తున్న టబ్ గ్రైండర్ యంత్రాలు పిండి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న టీడీపీ కూటమి సర్కారు.. ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది. 
 
త్వరలోనే రాజధాని నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలవనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్నం అమరావతి నిర్మాణంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 
 
నాలుగు ప్రధాన నగరాలను కలిపి మెగా సిటీగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతిని కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది. వచ్చే పాతికేళ్లలో ఈ నగరాలను అనుసంధానం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
 
అమరావతికి వరద ముప్పు లేకుండా ఉండేలా రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణంలోని సింగపూర్‌ను మళ్లీ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరెస్టు నుంచి రక్షిణ కల్పించలేం కానీ... వర్మకు హైకోర్టులో షాక్!

పుష్ప-2- 275 కోట్ల రూపాయలకు టీవీ రైట్స్.. నెట్‌ఫ్లిక్స్ అదుర్స్

మొన్న కిరణ్ - నిన్న వరుణ్ - నేడు విశ్వక్.. టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారిపోయారు..

ఆ కష్ట సమయంలో నా భార్య వెన్నెముకగా నిలిచింది : జానీ మాస్టర్

'పుష్ప-2' ట్రైలర్‌లో అరగుండుతో కనిపించే నటుడు ఎవరబ్బా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments