Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అరెస్టు నుంచి రక్షిణ కల్పించలేం కానీ... వర్మకు హైకోర్టులో షాక్!

ramgopal varma

ఠాగూర్

, మంగళవారం, 19 నవంబరు 2024 (11:27 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి చేసిన అసభ్యకర పోస్టుల కేసులో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఈ కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. అంతలా అరెస్టు భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సలహా ఇచ్చింది. క్వాష్ పిటిషన్‌లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. 
 
అలాగే, పోలీసుల ముందు హాజరయ్యేందుకు కూడా కొంత గడువు ఇవ్వాలంటూ రాంగోపాల్ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్ధననూ కూడా తోసిపుచ్చింది. ఈ తరహా అభ్యర్థనను సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్.హెచ్.వో) వద్ద చేసుకోవాలని, కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొంది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ముత్తనపల్లి రామలింగయ్యకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. 
 
గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రతిష్టను దిగజార్చేలా సామాజిక మాధ్యమాలలో వర్మ అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగయ్య ఫిర్యాదు చేశారు. మద్దిపాడు పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. 
 
రామ్ గోపాల్ వర్మ తరపున టి.రా జగోపాలన్ వాదనలు వినిపించారు. గత ఏడాది డిసెంబరులో పిటిషనర్ పోస్టు పెట్టారన్నారు. ఆ పోస్టుకు ఫిర్యాదుదారుడు బాధితుడు కాదన్నారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. మంగళవారం సంబంధిత ఎనోచ్ ముందు హాజరు కావాల్సి ఉందని, హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. అయితే, హైకోర్టు ఇవేమీ పట్టించుకోకుండా వర్మకు తేరుకోలేని షాకిచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొన్న కిరణ్ - నిన్న వరుణ్ - నేడు విశ్వక్.. టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారిపోయారు..