Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిళ్లకు కొత్త రూల్స్ - అతిక్రమిస్తే చర్యలు - ఏపీలో ఆంక్షలు సడలింపు

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (20:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చారు. ముఖ్యంగా, ఇది పెళ్లిళ్ళ సీజన్ కావడంతో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉండటంతో వివాహాల కోసం కొత్త నిబంధనను అమలు చేయనున్నారు. దీన్ని అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
కోవిడ్ నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తాజాగా క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఆరోగ్యశాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటూ వెళ్లాలని అన్నారు. 
 
వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రతీ స్కూల్‌లో టెస్టింగ్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు దృష్టి సారించాలని సీఎం జగన్ సూచించారు.
 
మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా మరో గంట పాటు కర్ఫ్యూ సడలింపును ప్రకటించారు. ఇకపై ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ అనుమతులు ఇవ్వనుండగా.. ఆ తర్వాత నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. ఇక పెళ్లిళ్లకు 150 మందికి మాత్రమే అనుమతి ఉందన్న సీఎం.. తెల్లవారుజామున పెళ్లిళ్లు ఉంటే.. ముందస్తుగా అనుమతి తప్పనిసరి అని తెలిపారు. 
 
కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం జగన్ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే, ఇప్పటికే కుదుర్చుకున్న పెళ్లిళ్లపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments