నీళ్లు తాగితే మూత్రానికి వెళ్తారనీ... ప్రైవేట్ స్కూల్స్ అకత్యాలు అన్నీఇన్నీకావయ్యా...

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (16:31 IST)
చాలా చోట్ల పాఠశాలలు, కాలేజీలు కనీస నిబంధనలు పాటించడం లేదని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ రెడ్డి కాంతారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి గుర్తింపును రద్దు చేయమని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. సోమవారం ఆయన డియాతో మాట్లాడుతూ.. తొలి విడత తనిఖీలో భాగంగా 13 జిల్లాల్లో ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు, పాఠశాలలను పర్యవేక్షించామని తెలిపారు. అధిక ఫీజుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఫీజులతో పాటు ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలను పరిశీలించామన్నారు.
 
 
విద్యాబోధనలో లోపాలున్నాయి... 
వైఎస్‌ చైర్‌పర్సన్‌ విజయ శారద రెడ్డి మాట్లాడుతూ.. తనిఖీలు చేసిన 120 కాలేజీల్లో చాలా చోట్ల కనీస వసతులు లేవన్నారు. పైగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ అందుకు తగ్గట్టు విద్యాబోధన లేదని వెల్లడించారు. విద్యాబోధనలో చాలా లోపాలను గుర్తించామన్నారు. విద్యార్థులకు మానసిక ఒత్తిడి పెంచి ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు.
 
మూత్ర విసర్జనకు వెళ్తారని డ్రింకింగ్‌ వాటర్‌కు నో... 
సెక్రటరీ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. ‘కళాశాలలు, పాఠశాలలు చెత్తకుప్పలుగా ఉన్నాయి. శుభ్రం అనేదే లేకుండా అంతా చెత్తతో నింపేస్తున్నారు. మరోవైపు నారాయణ, చైతన్య సిండికేట్‌ లాగా ఏర్పడి విద్యను వ్యాపారం చేశారు. ఈ కాలేజీలు చంద్రబాబుకు బినామీలుగా మారాయి. టీడీపీకీ పార్టీ ఫండ్‌ ఇస్తూ బాబును మేనేజ్‌ చేసుకుంటూ వచ్చాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా పాఠశాల్లలో విద్యార్థులు యూరినల్స్‌కు వెళ్తారని తాగునీరు సదుపాయాన్ని తగ్గించారని విస్తుపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments