Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘దిశ’ యాప్‌లోని ముఖ్యాంశాలు ఇవీ..

Advertiesment
Andhra Pradesh
, గురువారం, 13 ఫిబ్రవరి 2020 (14:39 IST)
* ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉంటుందని పోలీసువర్గాలు తెలిపాయి.
* ఇంటర్నెట్‌ ఉన్నా.. లేకపోయినా యాప్‌ పనిచేస్తుంది.
* ఫోన్‌లో యాప్‌ని తెరిచి ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే ఆ ఫోన్‌ లొకేషన్‌ వివరాలు, ఆ ఫోన్‌ నెంబరు ఎవరి పేరు మీద ఉంది, చిరునామా వంటి వివరాలన్నీ పోలీసు కంట్రోల్‌ రూంకి వెళతాయి.
* ఫోన్‌ లొకేషన్‌, 10 సెకన్ల నిడివిగల వీడియో, ఆడియో కూడా కంట్రోల్‌ రూంకి చేరతాయి. బాధితురాలు ఎక్కడున్నారో, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేసేందుకు వీడియో, ఆడియో ఉపయోగపడతాయి.
 
* ఈ యాప్‌లో ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ అని ఒక ఆప్షన్‌ ఉంది.
* ఉదాహరణకు ఒక మహిళ విజయవాడలో బెంజ్‌సర్కిల్‌ నుంచి బస్టాండ్‌కి ఆటో లేదా క్యాబ్‌లో వెళుతుంటే.. ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌లో బయల్దేరిన ప్రాంతం, గమ్యం నమోదుచేయాలి. ఆ మహిళ వెళుతున్న మార్గాన్ని కంట్రోల్‌ రూం నుంచి గమనిస్తారు. నమోదుచేసిన మార్గంలో కాకుండా, ఆటో మరో మార్గంలోకి వెళ్తే వెంటనే పోలీసు కంట్రోల్‌ రూంని, స్థానికంగా ఉన్న పోలీసుస్టేషన్‌ను అప్రమత్తం చేస్తూ సందేశం వెళుతుంది.
 
* ఆపదలో ఉన్నప్పుడు అత్యవసర సమాచారం పంపేందుకు కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల ఫోన్‌ నంబర్లను యాప్‌లో నమోదు చేయవచ్చు. ఐదు నంబర్లు నమోదు చేసేందుకు వీలుంటుంది. ఎస్‌ఓఎస్‌ సందేశం పంపినా, ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌ వినియోగించినప్పుడు వాహనం దారితప్పి వెళుతున్నా.. పోలీసులతో పాటు, ఈ ఐదు నంబర్లకూ సందేశం వెళుతుంది.
 
* ఆపదలో ఉన్నవారు యాప్‌లో ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కగానే.. ఆ సమాచారాన్ని వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్‌కి, అక్కడికి దగ్గర్లో ఉన్న పోలీసు రక్షక వాహనాలకు కంట్రోల్‌ రూం నుంచి ఆటోమేటిక్‌ కాల్‌ డిస్పాచ్‌ విధానంలో పంపిస్తారు.
* జీపీఎస్‌ అమర్చిన పోలీసు రక్షణ వాహనాల్లో ‘మొబైల్‌ డాటా టెర్మినల్‌’ ఉంటుంది. వాహనం ఉన్న ప్రాంతం నుంచి ఆ సందేశం వచ్చిన ప్రాంతం వరకు రూట్‌ మ్యాప్‌ అందులో కనిపిస్తుంది. దాన్ని అనుసరించి ఆ వాహనం ఆ ప్రదేశానికి చేరుకోవచ్చు.

* యాప్ ద్వారా 100/112 నంబర్లకూ సహాయం కోసం ఫోన్‌ చేయవచ్చు.
* యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్‌ నంబర్లు, సమీపంలోని పోలీసుస్టేషన్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి.
* ఈ యాప్‌ని ప్రధానంగా మహిళల కోసమే ఉద్దేశించినా, ఆపదలో ఉన్న వృద్ధులూ దీన్ని ఉపయోగించవచ్చు.
* వైద్యసేవలు అవసరమైనప్పుడు యాప్‌ ద్వారా దగ్గర్లోని మెటర్నిటీ, ట్రామా కేర్‌ సెంటర్లు, ఇతర ఆస్పత్రులు, బ్లడ్‌ బ్యాంకులు, ఫార్మసీలు వంటి వాటి వివరాలు తెలుసుకోవచ్చు.
 
* ఇంకా ఈ యాప్‌లో సమీపంలోని సురక్షిత ప్రదేశాల వివరాలు, బాధితులు ఉన్న ప్రదేశం నుంచి సమీపంలోని పోలీసు స్టేషన్లకు, సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు మార్గసూచి (నావిగేషన్‌)లు, పోలీసు డైరెక్టరీ, అత్యవసర సమయాల్లో ఫోన్‌ చేయాల్సిన నంబర్లు, సామాజిక మాధ్యమాలు, రోడ్డు భద్రత వంటి ఆప్షన్లు పొందుపరిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నాటకలో లోకల్ ఫైట్... తిరుపతి బస్సులపై రాళ్ళదాడి... తెలుగు యువతకు ఎర్త్?