Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసు నోటీసులు అందుకున్న రాంగోపాల్ వర్మ.. త్వరలోనే అరెస్టా?

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (19:03 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం పోలీసులు హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆర్జీవీ ఇంటికి వచ్చి ఈ నోటీసులు ఇచ్చారు. 
 
కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్జీవీ వ్యూహం పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టారు. 
 
దీనిపై ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్‌లో కేసు నమోదైంది. మద్దిపాడు మండల టీడీపీ కార్యదర్శి ఎం.రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం ఆర్థరాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, తుళ్లూరులో కూడా వర్మపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ ఫోటోలను వర్మ గతంలో మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాట రామారావు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. ఎంతో కష్టపడ్డాను : ఐశ్వర్య రాజేష్

హరిహర వీరమల్లు తాజాఅప్ డేట్ - రాయల్ లుక్ లో నిధి అగర్వాల్

చిరంజీవికి విశ్వక్‌సేన్ లైలాకు లింకేమిటి?: లైలా రివ్యూ

అంచనాలకు మించి వసూళ్ళను రాబట్టిన రీ-రిలీజ్ మూవీలు

1000 వాలా చిత్రం టీం వర్క్ చాలా ముచ్చట వేసింది : సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments