Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2022 నాటికి పూర్తి..?

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (18:34 IST)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2022 నాటికి పూర్తి అవుతుందనే ఆశాభావంతో ఉన్నామని ప్రాజెక్టు ఆధారిటీ డ్యాం డిజైన్ ప్యానల్ చైర్మన్ ఏ బి. పాండ్యా వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నామని పాండ్యా తెలిపారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు.  
 
పోలవరంలో 52 మీటర్ల ఎత్తున స్పిల్వే పిల్లర్ల నిర్మాణం పూర్తి అయ్యిందని స్పిల్ వే బ్రిడ్జి 1128 మీటర్లుకుగానూ 1105 పూర్తి చేయడం జరిగిందని అన్నారు. మిగిలిన 23 మీటర్లు ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. 48 గేట్లకు గానూ 29 గేట్లు బిగింపు పూర్తయిందన్న ఆయన గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లు,పవర్ ప్యాక్ లు అమార్చే పనులు వేగవంతం సాగుతున్నాయని వెల్లడించారు. గెడ్డర్లు అమరిక నేటితో పూర్తయిందని పేర్కొన్నారు. 
 
కాగా.. శనివారం 16వ పోలవరం ప్రాజెక్టు ఆధారిటీ డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్ సమావేశాన్ని రాజమండ్రిలో నిర్వహించారు. ఈ సమావేశం పోలవరం ప్రాజెక్టు డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్ చైర్మన్ ఏ.బి. పాండ్యా అధ్యక్షతన జరిగింది.
 
ఇక సమావేశంలో అయిదు అంశాలపై చర్చించారు. వరదలు సమయంలో కోతకు గురైన ఎడమ గట్టు పరిరక్షణ కూడా చర్చకు వచ్చింది. సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అధారిటీ సిఇఓ చంద్రశేఖర్ అయ్యార్, జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజనీర్ ఇన్ ఛీఫ్ సి. నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments