Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూల్స్‌కు సమీపంలో గుట్కా - పాన్ షాపులు మూసివేత.. ఏపీ సర్కారు ఆదేశం

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (10:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు 200 మీటర్ల దూరం వరకు ఉన్న అన్ని పాన్, గుట్కా షాపులను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. విద్యార్థులు చెడు వ్యసనాల బారినపడకుండా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలకు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్‌లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
 
అలాగే, ప్రభుత్వ పాఠశాలల పరిసరాలు, పరిశుభ్రతను పరిశీలించే బాధ్యతను ఏఎన్ఎం‌లకు అప్పగించారు. ఒక్కో ఏఎన్ఎంకు రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక ప్రభుత్వం కొత్తగా ఓ యాప్‌ను తీసుకొచ్చింది. 
 
ఏఎన్ఎం ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పరిస్థితిని ఫోటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చెయ్యాల్సి ఉంటుంది. పాఠశాలల సమీపంలో పాన్ గుట్కా షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఇది పాఠశాల సమీపంలో సిగరెట్ తాగడాన్ని కూడా నిషేదించారు. మద్యం దుకాణాలు పాఠశాలకు సమీపంలో లేకుండా చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments