తండ్రి మరణించాడని తెలిసి కన్నెత్తి చూడని తాగుబోతు.. అంత్యక్రియలు నిర్వహించిన అధికారులు

ఠాగూర్
ఆదివారం, 9 నవంబరు 2025 (18:09 IST)
కన్నతండ్రి మరణించాడని తెలిసినప్పటికీ ఓ తాగుబోతు కన్నెత్తిచూడలేదు. దీంతో అధికారులో పెద్ద మనసుతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన చీరాల శ్రీనివాసరావు (60), అన్నపూర్ణ భార్యాభర్తలు. వీరి కుమారుడు సురేశ్‌ మద్యానికి బానిసయ్యాడు. మూడు నెలల క్రితం అన్నపూర్ణ మరణించారు. సురేశ్‌కు గతంలో వివాహం కాగా.. భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. 
 
ఈ నెల 6న తండ్రి శ్రీనివాసరావు అనారోగ్యానికి గురికావడంతో.. సురేశ్‌ పర్చూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చి వెళ్లిపోయాడు. చికిత్స పొందుతూ అతడు ఈ నెల 7వ తేదీన మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో ఆసుపత్రి అధికారులు పర్చూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
ఎస్ఐ జీవీ చౌదరి నూతలపాడులో విచారించగా.. సురేశ్‌ మద్యానికి బానిసయ్యాడని, బందువులు చీరాలలోని హస్తినాపురంలో ఉంటారని తెలిసింది. దీంతో బంధువులకు సమాచారం ఇచ్చి.. సురేశ్‌ కోసం పోలీసులు గాలించారు. ఆదివారం సురేశ్‌ను గుర్తించి.. బంధువుల ఆధ్వర్యంలో మృతదేహం అప్పగించారు. 
 
దహన సంస్కారాలకు తన వద్ద డబ్బుల్లేవని సురేశ్‌  చెప్పడంతో.. తమవంతుగా పోలీసులు, పంచాయతీ అధికారులు ఆర్థిక సాయం చేశారు. అనంతరం పర్చూరు హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవిని క్షమాపణలు కోరిన వర్మ ... ఎందుకో తెలుసా?

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments