Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎదురింటి మహిళపై భర్త అత్యాచారం చేస్తుంటే.. భార్య వీడియో తీసింది..!

Webdunia
బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (14:47 IST)
ఎదురింటి మహిళపై కట్టుకున్న భర్త అత్యాచారం చేస్తుంటే.. అడ్డుకోవాల్సిన భార్య ఆ పాడుపనిని వీడియో తీయడం విజయవాడలో కలకలం రేపింది. ఈ ఘటన విజయవాడలో ఫిబ్రవరి 3న జరిగినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. జిత్ సింగ్ నగర్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో పిల్లలతో కలిసి నిద్రపోతున్న మహిళపై నిందితుడు దిలీప్ అని.. వీడియో తీసిన అతడి భార్య తులసి అని పోలీసులు వెల్లడించారు.
 
ఈ నెల 3న బాధిత మహిళ నిద్రపోతున్న సమయంలో ఎదురింట్లో ఉండే దిలీప్, అతడి భార్య తులసి వచ్చి మహిళ నోరు గట్టిగా మూసి తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. మహిళపై నిందితుడు రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ తతంగాన్ని నిందితుడు దిలీప్ భార్య తులసి వీడియోలు, ఫోటోలు తీసింది.

ఆ తర్వాతి రోజు ఈ వీడియోలను చూపించి మరోమారు నిందితుడు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పిల్లలను చంపేస్తానని, ఫొటోలు బయటపెట్టి పరువు తీస్తానని హెచ్చరించాడు. 
 
తాజాగా తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలని నిందితుడు పదే పదే వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments