Webdunia - Bharat's app for daily news and videos

Install App

2018లో జరిగిన గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేసిన ఏపీ హైకోర్టు

ఠాగూర్
బుధవారం, 13 మార్చి 2024 (15:09 IST)
గత 2018లో జరిగిన గ్రూపు-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మెయిన్స్ పేపర్‌ను రెండు సార్లు మూల్యాంకనం చేయించుకుంటూ పిటిషన్ దాఖలైంది. పైగా నచ్చిన వారిని ఎంపిక చేసి ఫలితాలను ప్రకటించారని ఆరోపించారు. మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మెయిన్స్ జవాబు పత్రాలను చేతిలో దిద్దే (మాన్యువల్) విధానం ద్వారా రెండుసార్లు మూల్యాంకనం చేశారని, కొందరు హైకోర్టును ఆశ్రయించారు. మొదటిసారి మూల్యాంకనం చేసిన ఫలితాలను పక్కన పెట్టి, రెండోసారి మళ్లీ మూల్యాంకన చేయించి వచ్చిన వారిని ఎంపిక చేసి ఏపీపీఎస్సీ ఫలితాలను ప్రకటించిందని పిటిషన్‌లో ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. 
 
మెయిన్స్ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టు విరుద్ధమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేయాలని ఆదేశించింది. మళ్లీ మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని, ఆరు వారాల్లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేసింది. అయితే, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై గ్రూపు-1 ద్వారా ఎంపికైన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments