Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ భక్త ఐపీఎస్ అధికారులపై వేటు పడుతుంది...

వరుణ్
శుక్రవారం, 21 జూన్ 2024 (10:19 IST)
గత వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆయన మంత్రుల వద్ద స్వామిభక్తిని ప్రదర్శించిన జగన్ భక్త ఐపీఎస్ అధికారులపై వేటుపడుతుంది. వైకాపాతో అంటకాగుతూ ఆ పార్టీ నాయకుల అరాచకాలకు కొమ్ముకాసిన వివాదాస్పద ఐపీఎస్‌ అధికారులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు చేపట్టడం మొదలుపెట్టింది. 
 
రాష్ట్ర డీజీపీగా ఉంటూ మొత్తం పోలీసు వ్యవస్థనే వైకాపా అనుబంధ విభాగంగా మార్చేసిన ప్రస్తుత ఏసీబీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ రెడ్డిని ఏ మాత్రం ప్రాధాన్యత లేని ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా బదిలీ చేసింది. సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై అక్రమ కేసులు బనాయించి, వేధించారనే ఫిర్యాదులున్న ప్రస్తుత అగ్నిమాపక శాఖ డీజీ పీవీ సునీల్‌ కుమార్‌కి అస్సలు పోస్టింగే ఇవ్వలేదు. 
 
సునీల్‌ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి సర్వసైన్యాధ్యక్షుడిలా వ్యవహరించిన చిత్తూరు జిల్లాలో వైకాపా నాయకుల దాష్టీకాలకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రస్తుత కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ఎస్పీ రిషాంత్‌ రెడ్డికీ ఏ పోస్టింగూ ఇవ్వలేదు. ఆయనను పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జగన్ భక్త ఐపీఎస్ అధికారులతో పాటు.. ఐఏఎస్ అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments