ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికిగాను సాధారణ సెలవుల జాబితాను వెల్లడించింది. కొత్త సంవత్సరంలో మొత్తం 20 సాధారణ సెలవులు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ సెలవులతో పాటు మరో 17 రోజులు ఐచ్ఛిక సెలవులు ఉంటాయని తెలిపింది. సాధారణ సెలవుల్లో సంక్రాంతి మొదలుకుని క్రిస్మస్ వరకు పండగల తేదీలను ప్రకటించింది. ఏయే తేదీల్లో సెలవులు వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం.