Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్

ఠాగూర్
శుక్రవారం, 12 జనవరి 2024 (08:37 IST)
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ గురువారం అధికార వైకాపాలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో స్వామిదాస్ వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. నల్లగట్ల స్వామిదాస్‌తో పాటు ఆయన అర్థాంగి సుధారాణి కూడా వైసీపీలో చేరారు.
 
నల్లగట్ల స్వామిదాస్ దాదాపు మూడు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్నారు. ఆయన 1994, 1999 ఎన్నికల్లో తిరువూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సందర్భంగా స్వామిదాస్ మాట్లాడుతూ... అవసరం లేకపోతే చంద్రబాబు ఎవరినైనా పక్కనబెట్టేస్తారని ఆరోపించారు. ఆయనలో మానవత్వం మచ్చుకైనా లేదని విమర్శించారు.
 
తాము టీడీపీలో దాదాపు 30 ఏళ్లు పనిచేసినా, తమను కనీసం ఇంట్లోకి కూడా రానివ్వలేదని స్వామిదాస్ వివరించారు. తాను, తన భార్య 10 రోజుల పాటు చంద్రబాబు ఇంటి ముందు పడిగాపులు కాసినా ఫలితం లేకపోయిందని, టీడీపీ నేతలే తమకు ద్రోహం చేశారని స్వామిదాస్ ఆరోపించారు. 
 
మగబిడ్డకు జన్మనిచ్చిన 14 యేళ్ల బాలిక... ఎక్కడ? 
 
కర్నాటక రాష్ట్రంలోని చిక్ బళ్లాపూర్‌‍లో 14 యేళ్ల బాలిక ఒకరు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఈ నెల 9వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, తుమకూరు జిల్లాలోని ఓ బాలిక స్థానికంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. ఈ బాలిక మంగళవారం ఓ ఆస్పత్రిలో ప్రసవించింది. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఈ విద్యార్థిని ఇటీవల హాస్టల్ నుంచి తన ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో తీవ్ర కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేసిన వైద్యులు ఆమె గర్భంతో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ఏం జరిగిందో తెలియక ఆ తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. అప్పటికే ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్న బాలికకు వైద్య పరీక్షల అనంతరం వైద్యులు ప్రసవం చేశారు. బాలిక బరువు తక్కువగా ఉన్నప్పటికీ.. శిశువు, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 
 
మరోవైపు, వైద్యులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ వ్యవహారంపై పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం బాలికకు బాలల సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇప్పించగా.. పాఠశాలలో సీనియర్ విద్యార్థి తాను గర్భందాల్చడానికి కారణమని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. 
 
అయితే, బాలుడిని విచారించగా నిరాకరించాడన్నారు. ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులూ చేయలేదని వెల్లడించారు. బాలిక, ఆమె తల్లిదండ్రులు ఏమీ మాట్లాడటంలేదని.. వాళ్లకు కౌన్సెలింగ్ కొనసాగుతోందన్నారు. బాలిక చెబుతున్న మాట్లలో నిలకడ లేదన్నారు. పాఠశాలలో మరో విద్యార్థి పేరు కూడా చెబుతోందని.. అందువల్ల అందరినీ విచారించి బాధ్యుల్ని గుర్తిస్తామని సీనియర్ పోలీస్ అధికారి వివరించారు. 
 
ఏపీలో మహిళలకు సంక్రాంతి నుంచి ఉచిత ప్రయాణం... ఆర్టీసీ క్లారిటీ 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు సంక్రాంతి పండుగ కానుకంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తుండగా, అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. దీంతో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు అమలు చేయబోతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారంపై ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు స్పందించారు. 
 
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఏ మేరకు భారం పడుతుంది? అని పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించామన్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 
 
మరోవైపు, సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకుంటే పది శాతం రాయితీ వస్తుందన్నారు. మరో నాలుగు నెలల్లో 1,500 కొత్త లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. 
 
ఈ రోజు (బుధవారం) నుంచి డోర్ డెలివరీ, పికప్ లాజిస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇక నుంచి లాజిస్టిక్ సేవలను ఆర్టీసీ ద్వారానే నిర్వహిస్తామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ వెబ్‌సైట్ ద్వారా తమను సంప్రదిస్తే డోర్ పికప్ చేసుకుంటామన్నారు. ప్రస్తుతం దీనిని పైలట్ ప్రాజెక్టుగా విజయవాడలో ప్రారంభించామని.. త్వరలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments