Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింత వ్యాధి నుంచి బయటపడిన ఏలూరు ప్రజలు!

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (10:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు.. అటు జాతీయ స్థాయిలో ఏలూరు పట్టణంలో వెలుగు చూసిన వింత వ్యాధి ప్రకంపనలు రేపింది. ఈ వ్యాధిబారినపడిన వందల మంది ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ఏలూరు పట్టణ వాసులంతా ప్రాణభయంతో వణికిపోయారు. అయితే, ఈ వింత వ్యాధి దాదాపుగా మాయమైంది. గడచిన మూడు రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఈ వింత వ్యాధి నుంచి ఏలూరు బయటపడిందని ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
 
బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్, ఏలూరు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇదేసమయంలో ఈ వ్యాధి సోకడానికిగల కారణాలపై ఉన్నతాధికారుల నివేదిక కూడా ప్రభుత్వానికి అందుతుంది. ఆపై వ్యాధి కారణాలను వివరించనున్న ప్రభుత్వం, ఏలూరు విముక్తమైందని ప్రకటిస్తుందని తెలుస్తోంది. 
 
కాగా, ఇటీవల వెస్ట్ గోదావరి జిల్లాలోని ఏలూరు పట్టణంలో కలుషిత నీరు తాగడం వల్లే ఈ వ్యాధి సంభవించిందని, రక్తంలో పరిమాణానికి మించి లోహాలు చేరడమే ప్రజలను అస్వస్థతకు గురిచేసినట్టు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌కు చెందిన నిపుణులతో కూడిన వైద్య బృందం తేల్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments