Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్!

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (13:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేనంత రుణభారం పడింది. ఏపీ మొత్తం రుణ భారం రూ.5 లక్షల కోట్లకు చేరుకుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో కార్పొరేషన్ల అప్పే రూ.1.35 లక్షల కోట్లకు చేరింది. మిగిలినవి రూ.4 లక్షల కోట్లుగా ఉన్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు రూ.5 లక్షల కోట్లు దాటిపోతున్నాయని ఆర్థికనిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తెచ్చిన రుణాల మొత్తం కూడా కలిపి లెక్కిస్తే అప్పు ఈ అంకెను దాటేస్తున్నట్లేనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
కార్పొరేషన్లకు సొంత వ్యాపారాలు లేకుండానే వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుని ప్రభుత్వ అవసరాలు తీరుస్తున్నాయి. ఆ రుణాల భారం పడేది ప్రభుత్వం పైనే. ఈ లెక్కన ఇప్పటికే దాదాపు రూ.4లక్షల కోట్ల వరకు ఉన్న ప్రభుత్వ అప్పునకు కార్పొరేషన్ల ద్వారా తీసుకువచ్చిన మరో రూ.1,35,600 కోట్లు కలిపి చూడాలని విశ్లేషిస్తున్నారు. ఈ లెక్కన ప్రభుత్వ అప్పు రూ.5.35 లక్షల కోట్ల మొత్తానికి చేరుకుంటున్నట్లే భావించాల్సి వస్తుందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments