Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పీకర్ తమ్మినేని సీతారాంకు కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 4 మే 2021 (10:06 IST)
ఆంధ్రప్రదేష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఈయన భార్య వాణిశ్రీకి కూడా కరోనా వైరస్ సోకింది. దీంతో వాణిశ్రీని శ్రీకాకుళంలోని మెడికోవర్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
అలాగే, తమ్మినేని సీతారాంకు నాలుగు రోజుల క్రితం వైరస్ సోకడంతో ఆయనను కూడా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈయన పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తూ వస్తోంది. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్న విషయం తెల్సిందే. సోమవారం ఒక్క రోజే ఏకంగా 18 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేయనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూను సడలిస్తారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments