Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో కఠిన చర్యలు.. 2 వారాల పాటు కర్ఫ్యూ

ఏపీలో కఠిన చర్యలు.. 2 వారాల పాటు కర్ఫ్యూ
, సోమవారం, 3 మే 2021 (14:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక రకాలైన కఠిన చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ కరోనా కట్టడికి ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. 
 
ఈ నెల 5వ తేదీ నుంచి నుంచి అమల్లోకి వచ్చేలా కర్ఫ్యూ విధించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తారు. ఈ సమయంలో ప్రజలు గుమికూడకుండా 144 సెక్షన్ అమలు చేస్తారు. అయితే అన్ని రకాల అత్యవసర సర్వీసులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు. బుధవారం నుంచి 14 రోజుల పాటు ఈ పాక్షిక కర్ఫ్యూ కొనసాగనుంది.
 
రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. తాజా ఉత్తర్వుల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఏపీలో ఇటీవల కొన్నిరోజులుగా రికార్డు స్థాయిలో కరోనా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. 
 
అదేసమయంలో మరణాల సంఖ్య పెరుగుతుండడం కూడా ఆందోళన కలిగిస్తోంది. లాక్డౌన్ విషయంలో ఎక్కడిక్కడ నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కేంద్రం రాష్ట్రాలకే అప్పగించింది. ఈ నేపథ్యంలో, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి వేడుకలో అధికార జులుం ప్రదర్శిన కలెక్టర్ సస్పెండ్!