Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్: బస్సులో చనిపోయిన వృద్ధుడు, శవాన్ని, భార్యను మధ్యలోనే దించేసిన ఆర్టీసీ సిబ్బంది: ప్రెస్ రివ్యూ

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (12:42 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులో ఓ వృద్ధుడు చనిపోయారు. మృతదేహాన్ని, వృద్ధుడి భార్యను సిబ్బంది దారి మధ్యలోనే దించేశారని ఈనాడు దినపత్రిక వార్తాకథనం ప్రచురించింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో సోమవారం చోటుచేసుకుంది.
 
సాలూరు బంగారమ్మ కాలనీకి చెందిన దాసరి పైడయ్య (82), పైడమ్మ దంపతులు బుట్టలు అల్లుకుంటూ జీవిస్తున్నారు. వారిద్దరూ కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని పత్రిక రాసింది. పలు ఆస్పత్రులకు వెళ్లినా నయం కాకపోవడంతో పార్వతీపురంలో నాటువైద్యం పొందేందుకు సోమవారం బస్సులో భార్యాభర్తలు బయల్దేరారు.
 
మార్గమధ్యంలో గుండెపోటుతో వృద్ధుడు చనిపోయాడు. దంపతులను బస్సు సిబ్బంది మధ్యలోనే బొబ్బిలి పెట్రోల్ బంక్ కూడలి వద్ద దించేసి వెళ్లిపోయారు. ఉపాధ్యాయుడు కృష్ణదాస్, స్థానికులు కొందరు వారిని ఆటోలో స్వగ్రామానికి పంపించారని ఈనాడు రాసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments