Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి... వైద్యులకు అతిపెద్ద పజిల్‌!

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (10:57 IST)
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఓ అంతుచిక్కని వ్యాధి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వ్యాధి దెబ్బకు స్థానికులంతా బెంబేలెత్తిపోతున్నారు. అటు వైద్యులతో పాటు.. ఇటు ప్రభుత్వం కూడా ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. 
 
ఇప్పటికే ఈ అంతుచిక్కని వ్యాధితో గత మూడు రోజుల వ్యవధిలో ఏకంగా 300మందికి పైగా స్థానికులు ఆస్పత్రి పాలయ్యారు. కొద్దిపాటి వాంతులు, మూర్ఛ, నోటి వెంట నురగతో గడిచిన 24 గంటలుగా రోగులు వరదలా వచ్చి చేరుతూనే ఉన్నారు. వ్యాధి ఏమిటో అంతుపట్టని వైద్యులు అందరికీ ప్రాథమిక చికిత్స చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 150మందికి పైగా ఇన్‌పేషెంట్లు ఉన్నారు. 
 
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆస్పత్రికి వచ్చిన దాదాపు 270మందికి కొవిడ్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌లు నిర్వహించగా అందరికీ నెగిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారులు ధ్రువీకరించారు. అప్పటికప్పుడు పదేళ్ల లోపు చిన్నారులు కొందరు హఠాత్తుగా ఫిట్స్‌ వచ్చి కూలపడడం, వీరంతా ఆస్పత్రికి రావడం తాజా పరిణామం. 
 
డయేరియా లక్షణాలు ఏమైనా ఉన్నాయోమేనని పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత నోటి నుంచి వస్తున్న నురుగును కూడా పరీక్షకు పంపారు. సాధారణంగా శరీరం విషతుల్యమైనప్పుడు నోటినుంచి నురుగు వచ్చే అవకాశం ఉంది. కానీ పరీక్షల్లో మాత్రం అటువంటిది ఏమీ లేదని నిర్ధారించినట్టు ఆస్పత్రి వర్గాలు తేల్చేశాయి. 
 
నిజానికి ఈ వ్యాధి ఏలూరులోని దక్షిణపు వీధికి చెందిన కొందరిలో ఫిట్స్‌ లక్షణాలు కన్పించాయి. వీరంతా చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించారు. రోగ నిర్ధారణ కాకపోవడంతో అందరూ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటూ అక్కడి వైద్యులు సూచించారు. అప్పటినుంచి ఆదివారం రాత్రి నాటికి 300మందికి పైగా చికిత్స కోసం ఆస్పత్రి బాట పట్టేశారు. 
 
సాధారణంగా ఈ ప్రాంతంలో నీటి కాలుష్యం కారణంగానే ఏడాది పొడవునా ఎంతో కొంతమంది డయేరియా బారిన పడుతూనే ఉంటారు. కానీ ఇప్పుడీ వ్యాధి అందరికీ పెద్ద పజిల్‌గా మారింది. వ్యాధి లక్షణాలు, రోగి తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించినా వైద్యనిపుణులు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఒకరిద్దరు మాత్రం మాస్‌ హిస్టీరియా అని తేల్చేస్తున్నారు. మరికొందరు మెదడు వాపు వ్యాధి అంటున్నారు. తాజా పరిస్థితికి అధికార పక్షం అంతుపట్టని వ్యాధిగా నామకరణం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అల్లు అర్జున్ 'పుష్ప-3' ఖాయం... ప్రధాన విలన్ ఆయనేనా?

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీకి అరుదైన రికార్డు

తెలంగాణాలో గద్దర్ అవార్డులు సరే.. మరి ఏపీలో నంది అవార్డులు ఇస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments