ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్... కృష్ణా జిల్లాలో ఒకరు మృతి

ఠాగూర్
ఆదివారం, 7 డిశెంబరు 2025 (09:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధి సోకి ఇప్పటికే కృష్ణా జిల్లాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఇప్పటికివరకు ఈ వ్యాధి కారణంగా చనిపోయినవారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ వ్యాధి సృష్టించిన కలకలంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 
 
జిల్లాలోని ఉయ్యూరు మండలం, మొదునూరు గ్రామానికి చెందిన శివశంకర్ (44)అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించగా స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఈ నెల 2వ తేదీన వైద్యాధికారులు ఆయన నుంచి రక్త నమూనాలు సేకరించి, పూణెలోని వైరాలజీ ప్రయోగశాలకు పంపించారు.
 
ఈ నివేదికలు రాకముందే ఆయన ప్రాణాలు కోల్పోయారు. శనివారం వచ్చిన నివేదికలో ఆయనకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మృతుడికి కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది.
 
కాగా, ఈ మృతి కేసుతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాధి మరింత ప్రబలకుండా నివారించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బృందాలు మొదునూరు గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పురుగుకాటుకు గురైనపుడు లేదా వ్యాధి లక్షణాలు కనిపించినపుడు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments