Webdunia - Bharat's app for daily news and videos

Install App

లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

ఠాగూర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (12:47 IST)
రాష్ట్రంలోని పల్నాడు జిల్లా యల్లమందలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పర్యటించారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా సీఎం వెళ్లి.. వారితో మాట్లాడారు. శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి పింఛన్‌ నగుదును చంద్రబాబు అందజేశారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె కూమార్తెకు మంచి చదువు చెప్పించాలని అధికారులను ఆదేశించారు. నీట్‌ కోచించి ఇప్పించాలని సూచించారు. శారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రూ.లక్ష రుణం ఇప్పించాలని సూచించారు. 
 
రాష్ట్రంలోని 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం కూట‌మి ప్ర‌భుత్వం రూ.2,717 కోట్లు విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో ప్ర‌భుత్వం 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేప‌ట్టింది. జనవరి 1వ తేదీకి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే పంపిణీ కార్యక్రమం చేప‌ట్టింది. దీనిలో భాగంగా మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 83.45 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి అయిన‌ట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల సమయానికి 53,22,406 మందికి రూ.2,256 కోట్లు పంపిణీ చేశారు.
 
లబ్దిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు పరిశీస్తున్నారు. ఇళ్ల వద్దే పింఛన్లు ఇస్తున్నారా? లేదా? అనే విషయాన్ని జియో ట్యాగింగ్ ద్వారా అధికారులు తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో జియో ట్యాగింగ్ విధానాన్ని ప్ర‌భుత్వం తీసుకువచ్చింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో పల్నాడు జిల్లా యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 
 
దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? 
 
దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి, పేద ముఖ్యమంత్రి ఎవరన్నది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఏడీఆర్) తాజాగా వెల్లడించింది. ఈ జాబితాలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. 
 
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట రూ.36 కోట్ల ఆస్తులు ఉండగా ఆయన భార్య భువనేశ్వరి పేరిట 895 కోట్ల ఆస్తులున్నాయి. మొత్తంగా ఆయన కుటుంబ ఆస్తుల విలువ రూ.931 కోట్లు ఉన్నట్టు ఏడీఆర్ పేర్కొంది. అలాగే, ఆయనకు రూ.10 కోట్ల అప్పు ఉంది.
 
అయితే, ఈ జాబితాలో కేవలం రూ.15 లక్షల ఆస్తితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అట్టడుగున నిలిచారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం.. చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ రూ.332 కోట్ల ఆస్తితో రెండో స్థానంలో ఉన్నారు. అలాగే ఆయన పేరిట అత్యధికంగా రూ.180 కోట్ల అప్పు కూడా ఉంది. మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నారు. ఆయన ఆస్తి విలువ రూ.51 కోట్లు. 23 కోట్ల రుణభారం ఉంది. జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ రూ.55 లక్షల ఆస్తితో కింది నుంచి రెండో స్థానంలో ఉన్నారు. 
 
రూ.1.18 కోట్ల ఆస్తులతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కింది నుంచి మూడోస్థానంలో ఉన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల సగటు ఆస్తి రూ.52.59 కోట్లు కాగా, వారి సగటు ఆదాయం ఏడాదికి రూ.13,64,310గా ఉంది. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లుగా ఉందని ఏడీఆర్ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ అంటే పెద్దరికం... పక్షపాతం లేకుండా స్పందించారు : సినీ నటి కస్తూరి

Akira: సాదాసీదాగా కాశీలో అకీరా, ఆద్య.. బాగా పెంచారని రేణు దేశాయ్‌కి కితాబు (video)

అభిమానులకూ, తల్లిదండ్రులకు పాఠాలు నేర్పిన 2024 సినిమా రంగం- స్పెషల్ స్టోరీ

కథానాయకుడు యష్ ను హీరోలంతా ఆదర్శకంగా తీసుకోవాలి

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

తర్వాతి కథనం
Show comments