Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న అన్నను కడతేర్చిన తమ్ముడు...

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (09:37 IST)
తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న అన్నను ఓ తమ్ముడు కడతేర్చాడు. అనంతపురం జిల్లా గుంతకల్ రూరల్ మండలంలోని గుండాల గ్రామంలో గత నెల 25వ తేదీన జరిగిన హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగా ఈ హత్య జరిగినట్టు నిర్ధారించారు. 
 
ఈ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఎల్లిపాయల రాజు (32) గత నెల 25వ తేదీన హత్యకు గురయ్యాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో హతుడి తమ్ముడే నిందితుడని తేల్చారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందునే అన్నను కడతేర్చినట్లు తమ్ముడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. 
 
ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఎల్లిపాయల రాజు మద్యానికి బానిసై జులాయ్‌గా తిరుగుతున్నాడు. ఏడాది కిందట కట్టుకున్న భార్యను హతమార్చాడు. ఈ కేసులో కోర్టు వాయిదాలకు హాజరవుతున్నాడు.
 
ప్రస్తుతం తమ్ముడు శ్రీనివాసులుతో కలిసి రాజు గొర్రెలను మేపుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మరదలితో రాజు సన్నిహితంగా ఉంటుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసులు రగిలిపోయాడు. ఈ నెల 24న రాత్రి గ్రామ సమీపంలోని వంక వద్ద మద్యం తాగి బండపై పడుకుని ఉన్న రాజు వద్దకు వెళ్లాడు. 
 
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అన్నతో గొడవపడ్డాడు. ఆగ్రహానికి గురైన శ్రీనివాసులు టవల్‌తో రాజు గొంతును బిగించి కిందపడేశాడు. అనంతరం గొంతుపై కాలితో నొక్కిపెడుతూ కొడవలితో నరికి, పక్కనే ఉన్న బండరాయితో తలపై మోది ప్రాణం తీసినట్టు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments