Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10 వేల నుంచి 15 వేల వరకు జీతం... విరుపాక్షి బిల్డింగ్‌లో స్కిల్ కనెక్ట్ డ్రైవ్, ఎప్పుుడు?

Advertiesment
10 వేల నుంచి 15 వేల వరకు జీతం... విరుపాక్షి బిల్డింగ్‌లో స్కిల్ కనెక్ట్ డ్రైవ్, ఎప్పుుడు?
, మంగళవారం, 30 అక్టోబరు 2018 (21:00 IST)
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో నవంబర్ 1న విజయవాడలోని హోటల్ ఐలాపురం దగ్గర్లోని విరుపాక్షి బిల్డింగ్‌లో స్కిల్ కనెక్ట్ డ్రైవ్ పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ జిల్లా మేనేజర్ ప్రణయ్ తెలిపారు. ఇంటర్వ్యూలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతాయి. 
 
ఈ స్కిల్ కనెక్ట్ డ్రైవ్‌కు నోవ్ యు మెడికెమెంట్ (NOUVEAU MEDICAMENT), ఎస్.బి.ఐ క్రెడిట్ కార్డ్స్, చోళ ఇన్సూరెన్స్, టాటా కేపిటల్ సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇంటర్య్వూల్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 10 వేల నుంచి 15 వేల వరకు జీతం ఇస్తారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబిఎ పాసైన వారంతా ఈ స్కిల్ కనెక్ట్ డ్రైవ్‌కి హాజరు కావచ్చు. నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మరిన్ని వివరాలకు 9963447166, 9700092606 నంబర్లలో సంప్రదించవచ్చని ఏపీఎస్‌ఎస్‌డీసీ జిల్లా మేనేజర్ ప్రణయ్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడికత్తి డ్రామా అందుకే... సీబీఐలో అంతా గుజరాత్ ఏజెంట్లే... జూపూడి