Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు కింద పడి ముగ్గురి ఆత్మహత్య

రైలు కింద పడి ముగ్గురి ఆత్మహత్య
Webdunia
ఆదివారం, 1 డిశెంబరు 2019 (12:10 IST)
కేంద్రంలోని జాతీయ ఉద్యానవనం సమీపంలో ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మూడో పట్టణ సీఐ రెడ్డప్ప, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపంపేట(జాకీర్‌ కొట్టాలు) ప్రాంతానికి చెందిన వెంకటేశు, పోలేరమ్మ(45) భార్యాభర్తలు. వీరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 
 
వీరికి ఆర్తి(17), దీప(11) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఆర్తి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి, నర్సింగ్‌లో శిక్షణ పొందుతోంది. కొన్ని ఆర్థిక కారణంగా పోలేరమ్మ తన ఆభరణాలను తాకట్టు పెట్టింది. ఈ ఆభరణాల విషయమై ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 9 గంటల సమయంలో పోలేరమ్మ భర్తతో గొడవ పడి కుమార్తెలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. 
 
ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వారి కోసం గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం తెల్లవారుజామున రైలు పట్టాలపై వారు విగతజీవులుగా కనిపించారు. రైలు పట్టాలపై మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments