Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం మల్లన్న సేవలో హోం మంత్రి అమిత్ షా

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (14:53 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. శ్రీశైలానికి తొలిసారి వచ్చిన ఆయనకు ఆలయం వద్ద పూర్ణ కుంభంతో వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఇందుకోసం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకున్నారు. హోం మంత్రికి స్వాగతం పలికినవారిలో ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాని మోహన్, బీజేపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, అంబాల ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు 
 
కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.. నల్లమల ఫారెస్ట్‌ మీదుగా ఆయన ప్రయాణం సాగడంతో.. ఇరు రాష్ట్రాల పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments