Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నివాసం కూల్చివేత ఖాయమా? పెంకుటిల్లులోకి టీడీపీ చీఫ్!

Webdunia
గురువారం, 27 జూన్ 2019 (14:07 IST)
కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజా వేదిక భవనాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. 
 
ఈ ప్రజావేదిక పక్కనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం కూడా ఉంది. దీంతో ఈ ఇంటిని కూడా రెవెన్యూ అధికారులు కూల్చివేసేందుకు నోటీసులు ఇవ్వొచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే కరకట్టపై ఉన్న దాదాపు 60 అక్రమ నిర్మాణాల యజమానులకు నోటీసులు కూడా జారీ చేశారు. 
 
ఈ నేపథ్యంలో చంద్రబాబు తాను నివసిస్తున్న ఇంటిని ఖాళీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే రంగంలోకి దిగిన తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అవసరాలకు తగ్గ ఇంటిని వెతికే పనిలో బిజీగా మారిపోయారు. చివరికి వెలగపూడిలో 90 ఏళ్ల పాతదైన ఇంటిని టీడీపీ నేతలు ఎంపిక చేశారు. 
 
ఈ పెంకుటిల్లును చంద్రబాబుకు ఇచ్చేందుకు వెలగపూడి మాజీ సర్పంచ్ శాంతమ్మ సంతోషంగా అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఈ ఇంటిని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పరిశీలించారు. మండువా లోగిలి, పచ్చటి చెట్లతో ఈ ఇల్లు బాగుందని ఆయన కితాబిచ్చారు. అయితే ఈ ఇంటిలోకి చంద్రబాబు ఎప్పుడు మారతారు? ఉండవల్లిలోని లింగమనేని గెస్ట్ హౌస్‌ను ఖాళీ చేస్తారా? అన్న విషయమై క్లారిటీ రావాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments